Page Loader
Coast Guard: పాకిస్తాన్ చెర నుండి ఏడుగురు భారతీయ మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డ్ 
పాకిస్తాన్ చెర నుండి ఏడుగురు భారతీయ మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డ్

Coast Guard: పాకిస్తాన్ చెర నుండి ఏడుగురు భారతీయ మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
08:18 am

ఈ వార్తాకథనం ఏంటి

అరేబియా సముద్రంలో పాకిస్థాన్‌ అధికారుల చెర నుంచి ఏడుగురు భారత మత్స్యకారులను భారత కోస్ట్‌గార్డ్‌ (Indian Coast Guard) సాహసోపేతంగా రక్షించింది. పాకిస్థాన్‌ మారిటైమ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (PMSA) నౌక మత్స్యకారులను తరలిస్తుండగా, ఐసీజీ వెంటాడి వారిని అడ్డుకుంది. 'నో ఫిషింగ్‌ జోన్‌' సమీపంలో మత్స్యకారులు సమస్యలో ఉన్నట్లు సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్‌ వేగంగా చర్యలు తీసుకుంది.

వివరాలు 

ఘటన వివరాలు 

భారత మత్స్యకారుల బోటు 'కాల భైరవ్‌' నుంచి సహాయం కోసం వచ్చిన సమాచారంతో ఐసీజీ స్పందించింది. పాకిస్థాన్‌ మారిటైమ్‌ ఏజెన్సీ బోటు వారిని అడ్డుకుని, ఏడుగురు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుసుకున్న కోస్ట్‌గార్డ్‌ వెంటనే చర్యలకు దిగింది. భారత-పాకిస్థాన్‌ సముద్ర సరిహద్దుల వద్దకు నౌకను పంపి, పీఎంఎస్ఏ నౌకను వెంబడించి చివరికి మత్స్యకారులను విడుదల చేయించింది.

వివరాలు 

ప్రస్తుత పరిస్థితి 

రక్షించబడిన మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. అయితే, కాల భైరవ్‌ బోటు ఘటనలో దెబ్బతిని మునిగిపోయిందని వెల్లడించారు. మత్స్యకారులు ఓడ నౌకాశ్రయానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టి, భారత్‌-పాకిస్థాన్‌ నౌకల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై విచారణ నిర్వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన ట్వీట్