LOADING...
Cockroach Janta Party: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిన 'కాక్‌రోచ్ పార్టీ'.. లక్ష మంది మద్దతు 
జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిన 'కాక్‌రోచ్ పార్టీ'.. లక్ష మంది మద్దతు

Cockroach Janta Party: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిన 'కాక్‌రోచ్ పార్టీ'.. లక్ష మంది మద్దతు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన 'కాక్‌రోచ్' వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో సరదాగా మొదలైన 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఇప్పుడు భారీ ఆన్‌లైన్ ఉద్యమంగా మారింది. అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్న అభిజీత్ దిప్కే అనే యువకుడు మే 16న ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఓ గూగుల్ ఫామ్ షేర్ చేస్తూ 'కాక్‌రోచ్ జనతా పార్టీ'లో చేరాలని పిలుపునిచ్చాడు. మొదట సరదాగా చేసిన ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే దాదాపు 15 వేల మంది స్పందించారు. ప్రస్తుతం ఈ పార్టీకి లక్ష మందికి పైగా సైన్‌అప్స్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షలకు పైగా ఫాలోవర్లు, ఎక్స్‌లో 62 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

వివరాలు 

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్ట్ వైరల్

"ఉద్యోగం లేని వారు, బద్ధకస్తులు, రోజంతా ఆన్‌లైన్‌లో ఉండేవారు, ప్రొఫెషనల్‌గా రాంట్ చేయగలిగేవారు అర్హులు" అంటూ చేసిన పోస్ట్ వైరల్ అయింది. తర్వాత సీజేఐ సూర్యకాంత్ తన వ్యాఖ్యలు నిరుద్యోగ యువతపై కాకుండా నకిలీ డిగ్రీలతో వృత్తుల్లోకి వస్తున్న వారిపై చేశానని స్పష్టత ఇచ్చినా.. అప్పటికే ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిపోయింది. లైవ్‌మింట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిజీత్ దిప్కే మాట్లాడుతూ.. "ఇది మొదట పూర్తిగా జోక్‌గానే మొదలైంది. కానీ యువత నుంచి వచ్చిన స్పందన ఊహించలేనిది. మూడు రోజులుగా నిద్రపోలేదు. చాలా మంది యువత తమ అసంతృప్తిని ఈ రూపంలో వ్యక్తం చేస్తున్నారు" అని చెప్పాడు. ముఖ్యంగా జెన్‌జీ యువత ఎక్కువగా ఇందులో చేరుతున్నారని తెలిపాడు.

వివరాలు 

త్వరలో ఇండియాకు వస్తా.. ఫౌండర్ కీలక ప్రకటన

"దేశంలో రాజకీయ పార్టీలు యువత కోసం ఏమీ చేయలేదనే భావన చాలా మందిలో ఉంది. అందుకే వారు ఈ ఉద్యమంతో కనెక్ట్ అవుతున్నారు. ప్రముఖ న్యాయవాదులు, అధ్యాపకులు, టీఎంసీ నేతలు కూడా మద్దతు ఇస్తున్నారు. ఇది క్రమంగా సరదా పోస్టు స్థాయి దాటి పెద్ద ఉద్యమంగా మారుతోంది" అని అన్నాడు. ఈ ఆన్‌లైన్ ఉద్యమాన్ని భవిష్యత్తులో నిజమైన రాజకీయ లేదా సామాజిక ఉద్యమంగా మార్చే ఆలోచన కూడా ఉందని అభిజీత్ వెల్లడించాడు. త్వరలో భారత్‌కు వచ్చి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సర్వే కూడా నిర్వహించే ప్లాన్‌లో ఉన్నామని చెప్పాడు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'కాక్‌రోచ్ పార్టీ' చేసిన ట్వీట్ 

Advertisement