Cockroach Janta Party: భారత్‌లో 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతా బ్లాక్.. అభిజీత్ దిప్కే వ్యాఖ్యలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఎక్స్ ఖాతాను భారత్‌లో నిలిపివేశారని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే(Abhijeet Dipke)వెల్లడించారు. ఇటీవల ప్రారంభమైన ఈ వ్యంగ్య రాజకీయ ప్రచారం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. కేవలం కొన్ని రోజుల్లోనే సీజేపీకి 6లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు సమాచారం. ఎక్స్‌లో ఈ ఖాతాకు 1.65లక్షల మంది ఫాలోవర్లు ఉండగా,ప్రస్తుతం లీగల్ డిమాండ్ కారణంగా ఖాతాను నిలిపివేసినట్లు ఎక్స్‌లో సందేశం కనిపిస్తోంది. అయితే పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఈ ఖాతాకు 12.3మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ప్రస్తుతం బీజేపీకి 8.7మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అభిజీత్ దిప్కే చేసిన ట్వీట్
As expected Cockroach Janta Party’s account has been withheld in India. pic.twitter.com/44ymllnSMJ
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026
వివరాలు
మే 16న ఆన్‌లైన్ క్యాంపెయిన్‌ప్రారంభించిన అభిజీత్ దిప్కే
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువతపై చేసిన 'కాక్‌రోచెస్‌లా ఉన్నారు' అన్న వ్యాఖ్యల తర్వాత ఈ ప్రచారం జోక్‌గా మొదలై వైరల్‌గా మారింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన అభిజీత్ దిప్కే మే 16న ఈ ఆన్‌లైన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. వ్యవస్థపై ఉన్న అసహనాన్ని వ్యంగ్యంగా చూపేందుకు ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ'ని స్థాపించారు."వ్యవస్థ లెక్కించడం మర్చిపోయిన ప్రజల ప్రతినిధులం"అని,"బద్ధకస్తులు,నిరుద్యోగుల గొంతుక" అని ఈ వేదిక తమను తాము అభివర్ణించుకుంది. పార్టీ మేనిఫెస్టోలో రిటైర్మెంట్ తర్వాత ప్రధాన న్యాయమూర్తులకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదని, పార్లమెంట్‌లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, పార్టీ మారే నేతలపై 20 ఏళ్ల నిషేధం విధించాలని వంటి డిమాండ్లు ఉన్నాయి.
వివరాలు
మళ్ళీ యాక్టివ్ అయ్యిన 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతా
తాజాగా 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతా మళ్లీ పునరుద్ధరించబడింది. ఈ విషయాన్ని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. కొద్ది గంటల పాటు భారత్‌లో నిలిపివేసిన ఈ ఖాతా తిరిగి అందుబాటులోకి రావడంతో సీజేపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఖాతా రీస్టోర్ కావడంతో పార్టీ కార్యకలాపాలు మళ్లీ ఎక్స్ వేదికగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అభిజీత్ దిప్కే చేసిన ట్వీట్
Follow now! https://t.co/cP2UHq4akq
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026