LOADING...
Ram mohan Naidu: విమానాశ్రయాల్లో రూ.10కే కాఫీ, రూ.20కే సమోసా
విమానాశ్రయాల్లో రూ.10కే కాఫీ, రూ.20కే సమోసా

Ram mohan Naidu: విమానాశ్రయాల్లో రూ.10కే కాఫీ, రూ.20కే సమోసా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమానాశ్రయాల్లో కాఫీ, మంచినీరు, సమోసా, స్వీట్లు ధరలను అందుబాటులో తెస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 'ఉడాన్‌ యాత్రి కెఫే'లను ప్రారంభించారు. ఇందులో కాఫీ రూ.10, మంచినీటి సీసా రూ.10, సమోసా లేదా స్వీట్లు రూ.20కి అందించనున్నారు. సోమవారం ఆయన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ 'ఉడాన్‌ యాత్రి కెఫే'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే కొన్ని విమానాశ్రయాల్లో ఈ కెఫేలు ప్రారంభించబడినట్లు చెప్పారు.

Details

త్వరలోనే కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ ప్రారంభం

అంతేకాక ఆయన విజయవాడలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే విజయవాడ నుంచి సింగపూర్, హైదరాబాద్ నుంచి డాలస్‌కి నేరుగా ప్రత్యేక విమానాలను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అదేవిధంగా, అహ్మదాబాద్, వారణాసి, కొచ్చి, పుణేలకు విజయవాడ నుంచి నేరుగా స్వదేశీ సర్వీసులు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏఏఐ బోర్డు సభ్యులు శ్రీనివాస్, శరద్ కుమార్, డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి, విమానాశ్రయ అభివృద్ధి కమిటీ సభ్యులు పొట్లూరి బసవరావు, ముప్పా రాజా, బండి విజయ్, ఏఏఐ అధికారులు పాల్గొన్నారు.