Medak: తెలంగాణలో చలి తీవ్రత.. మెదక్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 14.2°C
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మూడు రోజులుగా రాత్రి, ఉదయం సమయాల్లో ఈదురు గాలులు వీస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి మెదక్‌లో ఉష్ణోగ్రత 14.2 డిగ్రీల సెల్సియస్ కింద నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 2.3 డిగ్రీలు తక్కువ. అదే రోజు ఆదిలాబాద్ జిల్లాలో 15.2, పటాన్‌చెరులో 17.2, హకీంపేటలో 18.3, నిజామాబాద్‌లో 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామబాద్ మినహా, మంగళవారం పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. బుధ, గురువారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది.