NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి
    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి
    భారతదేశం

    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి

    వ్రాసిన వారు Naveen Stalin
    March 30, 2023 | 03:26 pm 0 నిమి చదవండి
    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి
    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; శిథిలాల కింద భక్తులు

    మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని ఒక ఆలయంలో గురువారం శ్రీరామ రామనవమి వేడుకలు జరుగుతుండగా మెట్లబావి కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలువురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఇండోర్‌లోని స్నేహ నగర్ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర్ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోతమ్ మిశ్రా ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి 11 మంది మృతదేహాలను (10 మంది స్త్రీలు, ఒక పురుషుడు) ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 19 మందిని రక్షించారు. రక్షించిన వారిలో ఇద్దరు వ్యక్తులు గాయాలతో ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి చెందారు. బావిలో ఇంకా చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

    రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

    భావి పురాతనమైనది కావడం వల్ల, ఎక్కువ సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా రావడంతో ఆ భారాన్ని తట్టుకోలేక పైకప్పు కూలిపోయి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో దాదాపు రెండు డజన్ల మంది మెట్టు బావిపై నిలబడి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంబులెన్స్‌లు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోకపోవడం వల్ల మరణాల సంభవించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మెట్ల బావి కూలిపోయిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఇండోర్ జిల్లా యంత్రాంగంతో సీఎంఓ నిరంతరం వివరాలను సేకరిస్తోందని, సంఘటనా స్థలంలో ఇండోర్ పోలీసు, జిల్లా పరిపాలన ఉన్నతాధికారులు ఉన్నట్లు సీఎం చెప్పారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    మధ్యప్రదేశ్
    ఇండోర్
    శ్రీరామ నవమి
    తాజా వార్తలు

    మధ్యప్రదేశ్

    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం రోడ్డు ప్రమాదం
    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు దక్షిణ ఆఫ్రికా
    ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి టెలికాం సంస్థ

    ఇండోర్

    ఇండోర్ పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్ క్రికెట్
    INDvsAUS : ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే టీమిండియా ఓడిపోయింది క్రికెట్
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి  మధ్యప్రదేశ్

    శ్రీరామ నవమి

    శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా
    ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు టి. రాజాసింగ్
    శ్రీరామనవమి శోభాయాత్రలో మళ్లీ ఘర్షణలు; బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు పశ్చిమ బెంగాల్
    West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్

    తాజా వార్తలు

    అత్యాధునిక AI వ్యవస్థలపై పరిశోధనలు ఆపేయండి: మస్క్‌తో పాటు 1000మంది ఐటీ నిపుణుల లేఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు ఏలూరు
    వేలాది మంది భారతీయ టెక్కీలకు గుడ్‌న్యూస్; H-1B వీసాపై అమెరికా కోర్టు కీలక తీర్పు వీసాలు
    యూకే కోర్టులో రాహుల్ గాంధీపై లలిత్ మోదీ దావా రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023