Page Loader
మరో వివాదంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. మహిళా రిపోర్టర్‌ పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు 
మరో వివాదంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. మహిళా రిపోర్టర్‌ పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు

మరో వివాదంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. మహిళా రిపోర్టర్‌ పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు 

వ్రాసిన వారు Stalin
Oct 02, 2023
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా రిపోర్టర్‌ పట్ల ఆయన వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా రిపోర్టర్ అన్నామలైని బీజేపీకి సంబంధించిన ప్రశ్న అడగ్గా, అతను కోపంతో మందలించాడు. ఈ చర్యను కోయంబత్తూరు ప్రెస్ క్లబ్ విమర్శించింది. అన్నామలైని ఓ మహిళా రిపోర్టర్ 'తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే, పార్టీలోనే ఉంటారా?' అనే ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న విన్న అన్నామలైకి కోపంతో జర్నలిస్ట్‌ను తన దగ్గరకు వచ్చి కూర్చోవాలని అన్నారు. ఈ ప్రశ్న ఎవరు అడిగారో టీవీలో చూస్తున్న వారికి తెలియాలని, అందుకే తన దగ్గరకు వచ్చి కూర్చోమని మహిళా రిపోర్టర్‌పై పదే పదే ఒత్తిడి చేశారు.

తమిళనాడు

అన్నామలై తీరును ఖండించిన ప్రెస్ క్లబ్ 

ఈ క్రమంలో తోటి జర్నలిస్టులు.. ఆ మహిళా రిపోర్టర్‌కు అండగా నిలిచారు. ఆ తర్వాత వెనక్కి తగ్గిన అన్నామలై మీడియాతో మాట్లాడారు. తాను పూర్తిస్థాయి నాయకుడిని కాను అని, రైతుగా ఉండడమే తనకు అసలైన గుర్తింపు అన్నారు. అలాగే ఒక రాజకీయ నాయకుడిగా బీజేపీతో ఉండటం వల్లే తనకు గుర్తింపు లభిస్తుందన్నారు. అలాగే మహిళా రిపోర్టర్‌కు సరైన రీతిలో ప్రశ్నలు అడగమని మాత్రమే తాను సలహా ఇస్తున్నానని అన్నామలై స్వరం తగ్గించి మాట్లాడారు. అన్నామలై తీరును కోయంబత్తూరు ప్రెస్ క్లబ్ అన్నామలై తప్పుపట్టింది. జర్నలిజంపై నీతి బోధించే ముందు, అన్నామలై నాయకుడిగా ఉండే నీతిని నేర్చుకోవాలని, గౌరవంగా ప్రవర్తించాలని పేర్కొంది.