Page Loader
NCW: అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. సుమోటోగా కేసు తీసుకున్న జాతీయ మహిళా కమిషన్
అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. సుమోటోగా కేసు తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

NCW: అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. సుమోటోగా కేసు తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి మహిళలపై సాక్షి ఛానెల్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన కమిషన్, రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్‌ రూపొందించిన ఆ లేఖలో, కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? తీసుకుని ఉంటే అవేంటనే అంశంపై మూడురోజుల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించారు.

Details

మహిళలు రైతులు కీలక పాత్ర పోషించాలి

అమరావతిలో జరుగుతున్న ఉద్యమంలో మహిళా రైతులు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, అటువంటి వారిపై ఈ రీతిలో వ్యాఖ్యానించడం అసహ్యకరమని మహిళా కమిషన్ అభిప్రాయపడింది. కృష్ణంరాజు వ్యాఖ్యలపై పత్రికల్లో, వార్తా ఛానళ్లలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును స్వప్రేరణతో (సుమోటోగా) తీసుకుని విచారణ ప్రారంభించామని కమిషన్ స్పష్టం చేసింది. మహిళల గౌరవాన్ని కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలు సహించమని కూడా హెచ్చరించింది.