Page Loader
ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు
ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు

ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు

వ్రాసిన వారు Stalin
Apr 01, 2023
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. అయితే ఈసారి ఫిర్యాదు చేసింది ఏ పార్టీ ప్రతినిధి కాదు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కోర్టులో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా ఫిర్యాదు మేరకు న్యాయవాది అరుణ్ భదౌరియా పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరిలో తన భారత్ జోడో యాత్రలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కమల్ భదౌరియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ

ఏప్రిల్ 12న పిటిషన్‌పై కోర్టులో విచారణ

జనవరి 9, 2023న హర్యానాలోని అంబాలాలో భారత్ జోడో యాత్రలో భాగంగా స్ట్రీట్-కార్నర్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ సభ్యులు 21వ శతాబ్దపు కౌరవులని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు కమల్ భదౌరియా తన పిటిషన్‌లో వెల్లడించారు. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 12న కోర్టులో విచారణ జరగనుంది. 'దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఎందుకు ఉంది' అనే పరువు నష్టం కేసులో గత నెలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.