Constables Suicide: మెదక్ జిల్లాలో కలకలం.. ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుళ్ల ఆత్మహత్యలు సంచలనంగా మారాయి.
ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్యలు ఉమ్మడి మెదక్ జిల్లాలో కలకలం రేపాయి. వేర్వేరు కారణాలతో సాయి కుమార్, బాలక్రిష్ణ అనే కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
కొల్చారం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టుకు ఉరివేసుకున్న సాయి కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిన్న అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
సాయి కుమార్ స్వస్థలం మెదక్ జిల్లా నర్సాపూర్ కాగా, వివాహేతర సంబంధం లేదా కుటుంబ కలహాలు ఆత్మహత్యకు కారణాలా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Details
కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించిన కానిస్టేబుల్
మరోవైపు సిద్దిపేట జిల్లాలో బాలక్రిష్ణ అనే కానిస్టేబుల్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించారు.
ఆయన భార్యకు నీళ్లలో ఎలుకల మందు, పిల్లలకు పాలల్లో పురుగుల మందు కలిపి ఇచ్చి బాలక్రిష్ణ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
బాలకృష్ణ మృతి చెందగా, పురుగుల మందు తాగిన అతని భార్య, పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి, పోలీసుల విచారణ కొనసాగుతున్నాయి.