LOADING...
హర్యానాలో మత కల్లోలంతో ముగ్గురి మృతి.. స్పందించిన సీఎం ఖట్టర్
స్పందించిన సీఎం ఖట్టర్

హర్యానాలో మత కల్లోలంతో ముగ్గురి మృతి.. స్పందించిన సీఎం ఖట్టర్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 01, 2023
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలో ఘోరం జరిగింది. మత ఘర్షణలతో ప్రాణ నష్టం సంభవించింది. నుహ్ పట్టణంలో ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. హర్యానాలో సోమవారం రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో ఇద్దరు హోంగార్డులు సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు వదిలారు. మరో 20 మందికిపైగా గాయాలబారిన పడ్డారు. నుహ్ సిటీలో మతపరమైన ఊరేగింపును ఓ గుంపు అడ్డుకునేందుకు యత్నిస్తూ రాళ్లు రువ్వి, కార్లకు నిప్పంటించారు. ఇందులో భాగంగానే విధుల్లో ఉన్న హోంగార్డులను కాల్చి చంపారని పోలీసులు వెల్లడించారు. బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్రను గురుగ్రామ్-అల్వార్ జాతీయ రహదారిపై కొంతమంది యువకులు అడ్డగించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఊరేగింపు సందర్బంగా హింస తారాస్థాయికి దారి తీసింది.

DETAILS

శాంతి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని సీఎం సూచన

ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలపైనా సదరు యువకుల గుంపు దాడికి పూనుకుంది. గురుగ్రామ్-సోహ్నా హైవే వరకు అల్లర్లు వ్యాపించాయి. ఊరేగింపులో పాల్గొనేందుకు నుహ్‌కు వచ్చిన దాదాపు 2, 500 మంది చెలరేగిన మారణకాండతో ఓ ఆలయంలో చిక్కుకుపోయారు. నుహ్, గురుగ్రామ్, పాల్వాల్, ఫరీదాబాద్‌ పట్టణాల్లో ఇంటర్నెట్ నిలిపేయడం సహా పలు నిషేధాలు విధించారు.గురుగ్రామ్, ఫరీదాబాద్ జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు మంగళవారం బంద్ ప్రకటించారు. భజరంగ్ దళ్ కార్యకర్త సమాజిక మాధ్యమాల్లో చేసిన ఓ అభ్యంతరకర పోస్ట్ వల్లే ఈ ఘర్షణ తలెత్తినట్లు పలు నివేదికల ద్వారా పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. శాంతి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని ఆయా ప్రాంతాల్లోని ప్రజానీకానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూచించారు.