
హర్యానాలో బస్సు-క్రూయిజర్ ఢీ; 8 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జింద్‌లోని భివానీ రోడ్డులోని బీబీపూర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంంలో 8మంది దుర్మరణం పాలయ్యారు. 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
క్రూయిజర్- ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.
క్షతగాత్రులను జింద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జింద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. మృతదేహాలను గుర్తించి కుటుంబీకులకు అప్పగించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రమాదంపై హర్యానా సీఎం విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్
आज जींद में भिवानी रोड पर हुए दर्दनाक सड़क हादसे में लोगों की आकस्मिक मृत्यु का समाचार अत्यंत दुखदाई है।
— Manohar Lal (@mlkhattar) July 8, 2023
ईश्वर दिवंगत आत्माओं को शांति दें व शोकाकुल परिजनों को दुःख सहन करने की शक्ति प्रदान करें। घायलों के शीघ्रातिशीघ्र स्वस्थ होने की कामना करता हूँ।
मैं प्रदेशवासियों से आग्रह…