ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
ఓ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన సంఘటన తాజాగా హర్యానా రాష్ట్రంలో జరిగింది.
హర్యానా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
ఈ క్రమంలో తమను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ ప్రజల్లో ఆగ్రహజ్వాలలు రేగుతున్నాయి.
తాజాగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌పై ఓ మహిళ చేయి చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధంచిన ఓ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతోంది.
ఇటీవలే కురుసిన భారీ వర్షాలకు ఘగ్గర్ నదిపై ఉన్న చిన్న డ్యామ్ దెబ్బతింది. దీంతో దిగువ ప్రాంతమైన ఘులా ప్రాంతాన్ని వరద ముంచెత్తింది.
details
భారీ వర్షాల వల్లే ప్రకృతి విపత్తు : ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్
అయితే సదరు ఏరియాలో పరిస్థితిని సమీక్షించేందుకు ఎమ్మెల్యే బుధవారం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే తమ బాధలు వ్యక్తపరిచేందుకు ఎమ్మెల్యేను జనం చూట్టు ముట్టారు.
తమ దుస్థితికి ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరే కారణమని భావిస్తూ ఓ మహిళ అకస్మాత్తుగా దూసుకొచ్చి ఇప్పుడెందుకు వచ్చావని నిలదీసింది. ఈ మేరకు చెంప చెళ్లుమనిపించింది.
దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే చుట్టూ రక్షణగా నిలబడ్డారు.
అనంతరం ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్, తాను తలుచుకుని ఉంటే డ్యామ్ దెబ్బతినేది కాదని ఆ మహిళ ఆరోపించారని, కాని అదో ప్రకృతి విపత్తని గుర్తు చేశారు.
సదరు మహిళపై తాను ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోబోనని, ఆమెను క్షమించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.