Loading...
Bharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా? 
Bharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా?

Bharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా? 

వ్రాసిన వారు Stalin
Feb 03, 2024
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' కేంద్రం బీజేపీ అగ్రనేత ఎల్ అద్వానీ, బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ (మరణానంతరం)కు ప్రకటించింది. కర్పూరి ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా ఆయన జాతికి చేసిన సేవలకు గౌరవ సూచికంగా కేంద్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. ఈ క్రమంలో వరకు ఇప్పటి వరకు భారతరత్న అవార్డును ఎంత మంది అందుకున్నారు. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1954లో భారతరత్న అవార్డును ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 'భారతరత్న'ను 50 మందికి ప్రకటించారు. వారిలో 17 మందికి మరణానంతరం ప్రదానం చేశారు. ఏదైనా రంగంలో అత్యుత్తమ సేవ లేదా అత్యున్నత స్థాయి పనితీరుకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తారు.

భారతరత్న

భారతరత్న అవార్డు అందుకున్నది వీరే..

1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు) -1954

2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి) -1954

3. చంద్రశేఖర్ వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)-1954

4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య కార్యకర్త, తత్వవేత్త, విద్యావేత్త)-1955

5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజనీర్, రాజకీయ నాయకుడు, మైసూర్ దివాన్) - 1955

6. జవహర్‌లాల్ నెహ్రూ (స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ప్రధాని) - 1955

7. గోవింద్ బల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమరయోధుడు) - 1957

8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు)- 1958

9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, రాజకీయ నాయకుడు, విద్యావేత్త, సామాజిక కార్యకర్త) - 1961

భారతరత్న

ఇందిరా గాంధీకి ఎప్పుడు ఇచ్చారంటే.. 

10 పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య కార్యకర్త) - 1961

11. రాజేంద్ర ప్రసాద్ (భారత మాజీ రాష్ట్రపతి) - 1962

12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య సమరయోధుడు)- 1963

13. పాండురంగ్ వామన్ కేన్ (ఇండాలజిస్ట్, సంస్కృత పండితుడు) -1963

14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (భారత మాజీ ప్రధాన మంత్రి) - 1966

15. ఇందిరా గాంధీ (భారత మాజీ ప్రధానమంత్రి) -1971

16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్ర్య సమరయధుడు, భారత మాజీ రాష్ట్రపతి) -1975

17. కుమారస్వామి కామరాజ్ (మరణానంతరం) (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) 1976

18. మదర్ థెరిసా (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) - 1980

ADVERTISEMENT

భారతరత్న

అంబేద్కర్‌కు ఏ సంవత్సరం ఇచ్చారంటే..

19. వినోబా భావే (మరణానంతరం)(స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త) -1983

20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య కార్యకర్త)-1987

21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) (రాజకీయనాయకుడు, నటుడు) -1988

22. భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త) -1990

23. నెల్సన్ మండేలా (వర్ణవివక్ష వ్యతిరేక కార్యకర్త) -1990

24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (భారత మాజీ ప్రధానమంత్రి) -1991

25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమరయోధుడు) - 1991

26. మొరార్జీ దేశాయ్ (భారత మాజీ ప్రధాన మంత్రి) -1991

27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమరయోధుడు) -1992

28. జహంగీర్ రతన్ జీ దాదాభోయ్ టాటా (పారిశ్రామికవేత్త)-1992

ADVERTISEMENT

భారతరత్న

అబ్దుల్ కలాంకు ఏ సంవత్సరం ఇచ్చారంటే

29. సత్యజిత్ రే (చిత్ర నిర్మాత) -1992

30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య సమరయోధుడు) -1997

31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమరయోధుడు) -1997

32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం (ఏరోస్పేస్, డిఫెన్స్ సైంటిస్ట్, భారత మాజీ రాష్ట్రపతి)-1997

33. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయని) -1998

34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్ర్య సమరయోధుడు) -1998

35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త) -1999

36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త) -1999

37. ప్రకాష్ గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమరయోధుడు) -1999

38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) -1999

39. లతా మంగేష్కర్ (ప్లే బ్యాక్ సింగర్) -2001

భారతరత్న

సచిన్ టెండూల్కర్‌కు ఎప్పుడు ఇచ్చారంటే..

40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్(హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్) - 2001

41. భీంసేన్ గురురాజ్ జోషి (హిందుస్తానీ క్లాసికల్ సింగర్) -2009

42. సి.ఎన్. ఆర్.రావు (కెమిస్ట్, ప్రొఫెసర్)-2014

43. సచిన్ టెండూల్కర్ (క్రికెటర్)-2014

44. అటల్ బిహారీ వాజ్‌పేయి (భారత మాజీ ప్రధానమంత్రి)-2015

45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యా సంస్కర్త)-2015

46. ​​నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)-2019

47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (ప్లే బ్యాక్ సింగర్, గేయ రచయిత, సంగీతకారుడు, కవి, చిత్రనిర్మాత)-2019

48. ప్రణబ్ ముఖర్జీ (భారత మాజీ రాష్ట్రపతి)-2019

49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం)(బిహార్ మాజీ ముఖ్యమంత్రి)- 2024

50. ఎల్‌కే అద్వానీ ( మాజీ ఉప ప్రధాని)-2024

ADVERTISEMENT