రాజ్యసభలో గందరగోళం.. టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్యసభలో నేడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు.
ఈ సీజన్ పార్లమెంట్ సమావేశాల మొత్తానికి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ధన్‌ఖడ్ ధ్రువీకరించారు. దిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా ఓబ్రియెన్ తీరుపై చైర్మన్ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అదేపనిగా నినాదాలు చేశారు. దీంతో విసుగు చెందిన స్పీకర్ ఒబ్రెయిన్ పై సస్పెన్షన్ వేటు విధించారు.
Details
సస్పెన్షన్ ను వ్యతిరేకించిన విపక్ష సభ్యులు
ఓబ్రియెన్‌ను సభ నుంచి సస్పెండ్ చేయాలని రాజ్యసభా పక్ష నేత పీయూష్ గోయల్ మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఛైర్మన్ ఓటింగ్ జరిపాడు.
దీంతో ఓబ్రియెన్‌ను ఈ సీజన్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయంపై విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.
గతంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పైన కూడా స్పీకర్ ఇదే విధంగా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.