
Chidambaram:కచ్చతీవు వివాదం.. విదేశాంగ మంత్రిపై చిదంబరం తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్, డీఎంకేలను విమర్శించడంపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు.
గత యాభై ఏళ్లుగా భారత మత్స్యకారుల్ని శ్రీలంక, ఆ దేశ మత్స్యకారుల్ని భారత్ నిర్బంధిస్తున్నాయన్నది వాస్తవమన్నారు.
ఇది వాజపేయి ప్రధాని గా ఉన్న సమయంలోనూ జరిగిందని, జై శంకర్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్గా, విదేశాంగ శాఖ కార్యదర్శిగా, విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలోనూ మత్స్యకారుల నిర్బంధాలు జరిగాయని పేర్కొన్నారు.
డీఎంకే, కాంగ్రెస్ లపై జై శంకర్ కొత్తగా మాట్లాడుతున్నారు. ఆయన ఆర్ఎస్ ఎస్, బీజేపీ మౌత్ పీస్గా మారిపోయారని దుయ్యబట్టారు.
Details
కచ్చతీవు అంశం చర్చలు జరుగుతూనే ఉన్నాయి: చిదంబరం
కచ్చతీవు అంశం ఇప్పుడే తెరపైకి వచ్చిన అంశం కాదని, దీనిపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం, శ్రీలంకకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు.
మాజీ దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ఈ కచ్చతీవు ద్వీపాన్ని వదిలించుకోవాలని అనుకున్నారని, ఇందిరాగాంధీ కూడా అలాగే భావించి ఆ మేరకు నిర్ణయాలు తీసుకున్నారని చిదంబరం ఈ సందర్భంగా గుర్తు చేశారు.