
Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి ఆరుగురు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధికారికంగా బుధవారం జాబితాను విడుదల చేసింది.
తెలంగాణ నుంచి మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయనున్నారు.
రేణుకా చౌదరి పార్టీలో చాలా సీనియర్ నాయకురాలు. ఆమెకు దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు ఉంది.
కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఐయూతో పాటు యూత్ కాంగ్రెస్‌లో అనిల్ కుమార్ యాదవ్ చాలా చురుగ్గా పని చేశారు. ఈ క్రమంలో యువకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పార్టీ అనిల్‌కు అవకాశం ఇచ్చింది.
కాంగ్రెస్
కర్ణాటక నుంచి అజయ్ మాకెన్ పోటీ
కర్ణాటక నుంచి ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. ఆయనతో పాటు రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ కూడా కర్ణాటక నుంచే రాజ్యసభకు పోటీ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్‌ను పోటీ చేయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే, బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు.