Page Loader
Congress: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన కాంగ్రెస్

Congress: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన కాంగ్రెస్

వ్రాసిన వారు Stalin
Dec 18, 2023
06:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరి కొన్ని నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు తెలంగాణలోని మొత్తం 17పార్లమెంట్‌ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లను నియమించింది. రేవంత్‌ రెడ్డి- చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - ఖమ్మం, మహబూబాబాద్‌ ఉత్తమ్‌ కుమార్‌‌రెడ్డి - నల్గొండ పొన్నం ప్రభాకర్ - కరీంనగర్‌ భట్టి విక్రమార్క -సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ జూపల్లి కృష్ణారావు - నాగర్‌కర్నూల్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - భువనగిరి కొండా సురేఖ - వరంగల్‌ సీతక్క -ఆదిలాబాద్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు -పెద్దపల్లి జీవన్‌ రెడ్డి - నిజామాబాద్‌ పి.సుదర్శన్‌రెడ్డి - జహీరాబాద్‌ దామోదర రాజనర్సింహ - మెదక్‌ తుమ్మల నాగేశ్వరరావు - మల్కాజిగిరి

కాంగ్రెస్

తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీని పోటీకి దింపుతాం: కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ తొలి రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం గాంధీభవన్‌లో సోమవారం జరిగింది. ఈ సమావేశంలోనే ఇన్‌చార్జ్‌లను నియమించారు. అలాగే, రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని పోటీకి దింపాలని తెలంగాణ కాంగ్రెస్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు లేఖ పంపనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 100 రోజుల్లో ఆరు హామీల అమలుపై చర్చించామని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తారన్నారు.