
Rajasthan: షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. పోలింగ్ వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
కొన్నిరోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. రాజస్థాన్‌లోని కరణ్‌పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు.
దిల్లీ ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కున్నార్ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
వారం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో గుర్మీత్ సింగ్‌ను జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ హాస్పిటల్‌లో చేర్పించారు.
ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.
రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరగాల్సి జరగనుంది. ఈ నేపథ్యంలో కరణ్‌పూర్‌లో పోలింగ్ వాయిదా పడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్
Rajasthan CM Ashok Gehlot condoles the demise of Congress candidate from Karanpur Assembly seat of Rajasthan, Gurmeet Singh Kooner pic.twitter.com/MGsYraKCfq
— ANI (@ANI) November 15, 2023