Congress: కంగనాకు కాంగ్రెస్ అభినందనలు.. నెటిజన్లు షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాపార రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. 'ది మౌంటైన్ స్టోరీ' పేరుతో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో కేఫ్‌ను ప్రారంభించనున్నారు.
ఫిబ్రవరి 14న ఈ కేఫ్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆమెకు అభినందనలు తెలిపింది.
'మనాలిలో పూర్తిగా శాకాహారంతో కూడిన రెస్టారెంట్ ప్రారంభించడం ప్రశంసనీయమని, ప్రత్యేక వెజ్ వంటకాలను టూరిస్టులకు అందిచాలంటూ కేరళ కాంగ్రెస్ తమ అధికారిక 'ఎక్స్' (ట్విటర్) ఖాతా ద్వారా స్పందించింది.
ఈ ట్వీట్‌కు కంగనాకు సంబంధించిన వీడియోను కూడా జత చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Details
చిన్ననాటి కల సాకారమైంది
అయితే, బీజేపీ ఎంపీగా ఉన్న కంగనాకు కాంగ్రెస్ అభినందనలు తెలిపిన విషయం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. 'ఈ ఖాతా హ్యాక్ అయ్యిందా?' అని ఒకరు, 'బహుశా స్కూల్ పిల్లలు ఈ ఖాతా నడుపుతున్నారు' అంటూ మరొకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
అంతేకాకుండా కాంగ్రెస్ మద్దతుదారులలో కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చిన్ననాటి కల ఇప్పుడు సాకారమైందని, హిమాలయాల ఒడిలో చిన్న కేఫ్ ప్రారంభించానని కంగనా రనౌత్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
సంప్రదాయ హిమాచల్ ఫుడ్‌ను మోడ్రన్ టచ్‌తో అందించడమే లక్ష్యమని వివరించారు.