Page Loader
Congress: తెలంగాణలో అధికారం దిశగా కాంగ్రెస్.. కార్యకర్తలు సంబరాలు 
Congress: తెలంగాణలో అధికారం దిశగా కాంగ్రెస్.. కార్యకర్తలు సంబరాలు

Congress: తెలంగాణలో అధికారం దిశగా కాంగ్రెస్.. కార్యకర్తలు సంబరాలు 

వ్రాసిన వారు Stalin
Dec 03, 2023
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ముందుకు సాగుతోంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలను కాంగ్రెస్ ఏకంగా క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తతం కాంగ్రెస్ పార్టీ 65 సీట్లలో, బీఆర్ఎస్ 38 చోట్ల, బీజేపీ 8చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట, ఇల్లెందులో భారీ మెజార్టీతో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాలుస్తూ.. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.

తెలంగాణ

రామగుండంలో కాంగ్రెస్ గెలుపు

రామగుండంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై ఆయన విజయం సాధించారు. అలాగే చార్మినార్‌లో ఎంఐఎం అభ్యర్థి గెలిచారు. ఆ పార్టీ అభ్యర్థి మీర్‌ జుల్ఫికర్‌ అలీ కాంగ్రెస్ అభ్యర్థిపై నెగ్గారు. ఇదిలా ఉంటే, కేసీఆర్ గజ్వెల్‌లో ముందంజలో ఉండగా, కామారెడ్డిలో వెనుకంజలో ఉన్నారు. అలాగే కొడంగల్‌, కామారెడ్డిలో పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందంజలో ఉండటం గమనార్హం. అలాగే, కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థులు గడ్డం వినోద్ బెల్లంపల్లిలో ముందంజలో ఉండగా, మహబూబాబాద్ నుంచి మురళీ నాయక్ భూక్యా మొదటి రౌండ్ కౌంటింగ్‌లో ఆధిక్యంలో ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గాంధీభవన్‌లో సంబరాలు