Page Loader
బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు
కాంగ్రెస్ దిగ్గజ నేత సి.రాజగోపాలాచారి మునిమనవడు సీఆర్‌ కేశవన్‌ బీజేపీలో చేరిక

బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు

వ్రాసిన వారు Stalin
Apr 08, 2023
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

తొలి భారత గవర్నర్ జనరల్, కాంగ్రెస్ దిగ్గజం సి.రాజగోపాలాచారి మనవడు, తమిళనాడుకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండు నెలల తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీలో తనను చేర్చుకున్నందుకు అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీఆర్ కేశవన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వం దేశంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని, ఆయన తమను సరైన మార్గంలో తీసుకెళ్తారని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేశవన్