Page Loader
'నన్నే కరుస్తావా'; పాము తల కొరికిన వ్యక్తి; వీడియో వైరల్
తమిళనాడు: పాము తల కొరికిన వ్యక్తి; వీడియో వైరల్; ముగ్గురి అరెస్టు

'నన్నే కరుస్తావా'; పాము తల కొరికిన వ్యక్తి; వీడియో వైరల్

వ్రాసిన వారు Stalin
Apr 06, 2023
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని రాణిపేటలో పామును పట్టుకుని, దాని తలను కొరికి, వీడియో రికార్డు చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యావరణ కార్యకర్తలు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు. కైనూర్‌లో నివసించే మోహన్, సూర్య, సంతోష్ అనే ముగ్గురు వ్యక్తులు పామును చిత్రహింసలకు గురిచేసి చంపి, దాన్ని వీడియో తీశారని పర్యావరణ కార్యకర్తలు ఆరోపించారు.

తమిళనాడు

పాము నుంచి రక్తం కారుతున్నా శరీరాన్ని తలను వేరు చేసిన మోహన్

మోహన్ పామును పట్టుకున్నట్లు వీడియోలో కనపడుతుంది. అది తన చేతిని కరవడంతో ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు అందులో మాటలను వింటే అర్థం అవుతుంది. మిగిలిన ఇద్దరు పామును ఒంటరిగా వదిలేయమని కోరినప్పటికీ, మోహన్ నిరాకరించి పాము తలను కొరికాడు. పాము రక్తం కారుతున్నా వదలకుండా, శరీరాన్ని తలను వేరు చేస్తున్న ఘటన అందులో కనపడుతుంది. ఈ ఘటనపై ఆర్కాట్ రేంజర్‌కు పర్యావరణ కార్యకర్తలు సమాచారం అందించగా, నిందితులను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులపై జంతు హింస, వన్యప్రాణులను చంపిన అభియోగాలు నమోదు చేశారు.