తదుపరి వార్తా కథనం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. మార్చి 19న భూమి పూజ!
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 05, 2024
05:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం నిర్ణయించింది.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో మార్చి 19 ఉదయం 9 గంటలకు భూమిపూజ నిర్వహించనున్నారు. ఆ రోజున రెడ్డి సంఘం నాయకుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ రెడ్డి అని, దేవుడిలా తమ కోరికలను రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడని అందువల్లే ఆయనకు గుడి కట్టబోతున్నట్లు చెప్పారు.
భూమి పూజకు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సంతోష్ విజ్ఞప్తి చేశారు.
మీరు పూర్తి చేశారు