
Bihar: బీహార్‌లో వరద తనిఖీ కోసం ఓ కాంగ్రెస్ ఎంపీ ఓవరాక్షన్.. గ్రామస్తుడి భుజంపైకి ఎక్కి..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. అది మరిచిపోయిన ఓ నేత.. ప్రజల చేతనే పని చేయించుకున్నాడు. బిహార్‌లో అక్కడి ఒక కాంగ్రెస్ ఎంపీ, ప్రజలతో కలిసి పని చేయించుకోవడం కన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేశారు. బీహార్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్, గ్రామస్తుల భుజంపై ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాలను చూశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడం వల్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
వివరాలు
అనారోగ్యంతో ఎంపీ
కతిహార్‌లో వరద ముంచెత్తింది. ఎంపీ తారిఖ్ అన్వర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించేందు వచ్చారు. వరద ప్రాంతాల్లో బురద ఉండడంతో ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని సులభతరం చేయడానికి, గ్రామస్తులు ఎంపీని భుజంపైకి ఎక్కించుకుని పొలాలు, గట్లు అన్ని చూపించారు. ఒక వ్యక్తి ఎంపీని భుజంపైకి ఎక్కించుకుని అన్ని దృశ్యాలను చూపించడానికి సహకరించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో చర్చలు, విమర్శలు పెరిగాయి. ఎంపీ అనారోగ్యంతో ఉండడంతోనే గ్రామస్తులు స్వయంగా భుజంపైకి ఎక్కించుకుని తీసుకెళ్లారని కతిహార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ యాదవ్ తెలిపారు అంతకముందు ట్రాక్టర్, పడవ, బైక్‌పై తిరిగారని.. ట్రక్కు బురదలో కూరుకుపోవడంతో రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
వివరాలు
రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్
అనారోగ్యంతో తల తిప్పడం ఇబ్బందిగా ఉందని చెప్పగానే, గ్రామస్తులు ప్రేమతో భుజంపైకి ఎక్కించుకున్నారని చెప్పుకొచ్చారు. ఇటీవల బీహార్‌లో భారీ వర్షాలు కురిసిన తర్వాత గంగా, కోసి, గండక్, ఘాగ్రా నదులు తీవ్రమైన వరదలకు గురయ్యాయి. దీంతో లక్షలాది ప్రజలు వరద ముప్పు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఇలాంటి సందర్భాల్లో నాయకుల ప్రవర్తన కారణంగా పార్టీకి ప్రతికూల ప్రభావం పడుతుందని ఈ సంఘటన సూచిస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశాలు
कटिहार के सांसद “तारिक अनवर” ! थोड़ा भी शर्म - लिहाज बाक़ी रहता, तो राजनीति छोड़ दिए होते ??
— Abhishek Singh (@Abhishek_LJP) September 8, 2025
pic.twitter.com/CdTHMUezX4