NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress Manifesto 2024: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల .. 5 న్యాయ్ లో భాగంగా 25 హామీలు! 
    తదుపరి వార్తా కథనం
    Congress Manifesto 2024: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల .. 5 న్యాయ్ లో భాగంగా 25 హామీలు! 
    కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల .. 5 న్యాయ్ లో భాగంగా 25 హామీలు!

    Congress Manifesto 2024: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల .. 5 న్యాయ్ లో భాగంగా 25 హామీలు! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 05, 2024
    12:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టో ''న్యాయ్‌పత్ర' ను శుక్రవారం విడుదల చేసింది.

    సార్వత్రిక ఎన్నికలకు రెండ్రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే,పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ సహా అగ్రనేతలు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

    ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ పీ చిదంబరం మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు,ఉద్యోగాల కల్పన,సంపద సృష్టి,సంక్షేమ సూత్రాలపై మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు.

    పార్టీ మేనిఫెస్టోలో 5న్యాయ్ లో భాగంగా 25 మీలు ఉన్నాయి.

    ఈ మేనిఫెస్టోలో రైతు న్యాయం,మహిళా న్యాయం,యువత న్యాయం,కార్మిక న్యాయం,భాగస్వామ్య న్యాయం వంటి 5 న్యాయాలు ఉన్నాయి.

    న్యాయ్ పత్ర 

    కాంగ్రెస్ మేనిఫెస్టో 'న్యాయ్‌పత్ర'లోని కీలక వాగ్దానాలు

    కేంద్ర ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో మంజూరైన పోస్టుల్లో దాదాపు 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది.

    సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం రాజస్థాన్ మోడల్ ₹25 లక్షల వరకు నగదు రహిత బీమాను స్వీకరించడం జరుగుతుంది.

    స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించే ఎంఎస్‌పికి చట్టపరమైన హామీలను కాంగ్రెస్ ఇస్తుంది.

    ప్రతి పౌరుడిలాగే మైనారిటీలకు దుస్తులు, ఆహారం, భాష, వ్యక్తిగత చట్టాల ఎంపిక స్వేచ్ఛ ఉండేలా కాంగ్రెస్ హామీ ఇస్తుంది.

    వ్యక్తిగత చట్టాల సంస్కరణలను ప్రోత్సహిస్తాం. అటువంటి సంస్కరణ తప్పనిసరిగా సంబంధిత సంఘాల భాగస్వామ్యం,సమ్మతితో చేపడతాం.

    Details 

    కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు

    కుల గణన నిర్వహించి, రిజర్వేషన్ల 50 శాతం పరిమితిని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

    రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, కార్మికుల ఆరోగ్యంపై హక్కుల కల్పన, రోజుకు కనీస వేతనం రూ.400 గా పట్టణ ఉపాధి హామీ వంటి వాగ్దానాలను కాంగ్రెస్ ఇచ్చింది.

    నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్‌లకు కేంద్ర ప్రభుత్వ సహకారం నెలకు ₹1,000కి పెంచుతామని తెలిపింది.

    పేద కుటుంబానికి చెందిన మహిళకు ప్రతి సంవత్సరం రూ.లక్షతో పాటు, కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు, ఆశా, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కార్యకర్తలకు అధిక వేతనాల హామీని పార్టీ ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్

    కాంగ్రెస్

    Vibhakar Shastri: కాంగ్రెస్ పార్టీకి షాక్.. మాజీ ప్రధాని మనవడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా  భారతదేశం
    Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్  సోనియా గాంధీ
    Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్  రాజ్యసభ
    Congress: కాంగ్రెస్ పార్టీ కి ఊహించని షాక్.. పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసిన ఐటీ శాఖ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025