Page Loader
Telangana congress: కాంగ్రెస్ రెండో జాబితో 22మంది రెడ్లు, 8మంది బీసీలు

Telangana congress: కాంగ్రెస్ రెండో జాబితో 22మంది రెడ్లు, 8మంది బీసీలు

వ్రాసిన వారు Stalin
Oct 28, 2023
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. దీంతో మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. నవంబర్ 2 నాటికి మిగిలిన 19 స్థానాలకు మూడో జాబితాను విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది. అక్టోబర్ 15న 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో జాబితాలో 8మంది బీసీ అభ్యర్థులు, రెడ్డి సామాజికవర్గం నుంచి 22 మంది, కమ్మ సామాజికవర్గం నుంచి ముగ్గురు, బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి ఒకరు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 11మంది అభ్యర్థులు ఉన్నారు.

కాంగ్రెస్

కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ?

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌, సిరిసిల్లలో కేటీఆర్‌కు పోటీగా కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దింపుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇది మూడో జాబితాలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి సిటును ఆశిస్తున్న సీనియర్ నేత షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ సీటు నుంచి కాంగ్రెస్ పోటీలో నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి టి.హరీష్‌రావుపై పూజల హరికృష్ణ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మహేశ్వరం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్

బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి వచ్చిన వారికి టెకెట్లు

ఇటీవల బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి రెండో జాబితాలో టికెట్లు దక్కాయి. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తాండూరు నుంచి బుయ్యని మనోహర్‌రెడ్డి, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, వి.శేరిలింగంపల్లి నుంచి జగదీశ్వర్ గౌడ్ టికెట్లు దక్కిచంచుకున్నారు. జూబ్లీహిల్స్‌ నుంచి మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ బరిలోకి దిగగా, అంబర్‌పేట నుంచి ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సి.రోహిణ్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దివంగత కాంగ్రెస్‌ నేత పి.జనార్దన్‌రెడ్డి కుమార్తె పి.విజయారెడ్డికి ఖైరతాబాద్‌ నుంచి టికెట్‌ లభించగా, ఆయన కుమారుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌ నుంచి టికెట్‌ నిరాకరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెండో జాబితా ఇదే..