Congress:అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు,చర్యలకు డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తక్షణమే ఆయనను పదవి నుండి తొలగించాలని, బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ సంచలన ఆరోపణలు చేశారు.
సుప్రియా శ్రీనేత్ మాట్లాడుతూ ... మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఈ విషయాన్ని ఆరెస్సెస్ సభ్యులు శంతను సిన్హా వెల్లడించారని తెలిపారు.
అయితే, మాల్వియా ఈ ఆరోపణలను ఖండించారు . వీటిని అమిత్ మాల్వియా కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌లోనే కాకుండా పశ్చిమ బెంగాల్‌లోని బిజెపి కార్యాలయాలనే మహిళలపై వేధింపులకు వేదికగా వాడుకున్నారని ఆరోపించారు.
వివరాలు
తేజస్విని సినీ ఎంట్రీ?అన్ స్టాపబుల్ షో నేర్పిన అనుభం
మహిళలకు న్యాయం చేయాలంటూ.. తాము ఆ పార్టీని కోరుతున్నామన్నారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవకముందే బిజెపి కి చెందిన ప్రముఖ నేత, ఐటీ సెల్ చీఫ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని అన్నారు.
అమిత్ మాల్వియాను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని సుప్రియా శ్రీనేత్ డిమాండ్ చేశారు.
ఆయన పదవిలో కొనసాగితే స్వతంత్ర విచారణ సాధ్యం కాదని అన్నారు. మాల్వియాను పదవి నుంచి తొలగించనంతవరకూ బాధితులకు న్యాయం జరగదని ఆమె స్పష్టం చేశారు.