LOADING...
Vice President Election: క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి.. సంబంధిత పార్టీల లిస్ట్ వెలువడే అవకాశాలు!
క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి.. సంబంధిత పార్టీల లిస్ట్ వెలువడే అవకాశాలు!

Vice President Election: క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి.. సంబంధిత పార్టీల లిస్ట్ వెలువడే అవకాశాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టమైన క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఇండియా కూటమి గుర్తించింది. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి అనుకున్నదానికంటే తక్కువ ఓట్లు వచ్చడంతో, ప్రతిపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు హస్తం పార్టీ పేర్కొంది. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి, కానీ సుదర్శన్‌రెడ్డికి 300 మాత్రమే. మిగతా 15 ఓట్లు చెల్లనివిగా పరిగణించారు. దాదాపు 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ సుదర్శన్‌రెడ్డిని ఓడించగా, 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇండియా కూటమికి చెందిన 315 మంది ఎంపీలు పోలింగ్‌లో పాల్గొన్నారు. కానీ సుదర్శన్‌రెడ్డికి 300 మాత్రమే ఓట్లు వచ్చాయి, మిగతా 15 ఓట్లు చెల్లనివిగా అయ్యాయి.

Details

క్రాస్ ఓటింగ్‌లో డీఎంకే ఎంపీలు పాల్గొన్నట్టు సమాచారం

చెల్లని ఓట్లను గుర్తించేందుకు హస్తం పార్టీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. ఈ క్రాస్ ఓటింగ్‌లో డీఎంకే ఎంపీలు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. రాధాకృష్ణన్ తమిళనాడు వాసి కాబట్టి, ఆయనకు ఓట్లు వేసినట్లు గుర్తించబడింది. అలాగే శివసేన (యూబీటీ) ఎంపీల నుండి ఎన్డీఏ అభ్యర్థికే ఓట్లు వచ్చాయని సమాచారం. మహారాష్ట్ర నుంచి ఏడు ఓట్లు క్రాస్ అయ్యాయి: శివసేన (యూబీటీ) నుంచి మూడు, కాంగ్రెస్ నుంచి నాలుగు. ఆప్, ఆర్జేడీ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు ప్రాథమికంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు, ఈ నేపధ్యంలో ఆయనకే ఓట్లు పడ్డాయని గుర్తించారు.