Page Loader
Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే 
Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే

Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే 

వ్రాసిన వారు Stalin
Nov 28, 2023
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఆఖరిరోజు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్(Congress) ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul gandhi), ప్రియాంక గాంధీ మంగళవారం పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈమేరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల ప్రచారం షెడ్యూల్‌ను కాంగ్రెస్ ఖరారు చేసింది. ముఖ్యంగా రాహుల్ మంగళవారం రోడ్ షోలు, వీధి సభల్లో పాల్గొంటారు. ఉదయం 10గంటల నుంచి రాహుల్ ప్రచారం ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ ప్రకటించింది. జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్ గిరి, ఆనంద్ బాగ్ చౌరస్తాలో రాహుల్ మాట్లాడనున్నారు. జహీరాబాద్, మల్కాజిగిరి సభల్లో ప్రియాంక గాంధీ(priyanka gandhi) పాల్గొంటారు. కామారెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్ ట్వీట్