Page Loader
మణిపూర్ అంశంపై రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ 
మణిపూర్ అంశంపై రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్

మణిపూర్ అంశంపై రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ 

వ్రాసిన వారు Stalin
Aug 09, 2023
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్ అంశంపై రాజ్యసభ గురువారం అట్టుడికింది. సభలో మణిపూర్ హింసపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టగా అధికార పక్ష సభ్యలు అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసగా రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. మణిపూర్‌పై సభలో సవివరమైన చర్చ జరిగినప్పుడు కొన్ని వివరాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ప్రధాని సభకు రావడానికి సిద్ధంగా లేరని, ప్రభుత్వం తమ మాట వినడానికి సిద్ధంగా లేదన్నారు. అందుకే నిరసనగా తాము వాకౌట్ చేసిన బయటకు వచ్చినట్లు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 మణిపూర్ అంశంపై అట్టుడికిన రాజ్యసభ