నా నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయి: డీకే శివకుమార్ సంచలన కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న తరుణంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
తన నాయకత్వంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయని స్పష్టం చేశారు. డీకే శివకుమార్ సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు తన పుట్టిన రోజుని, మొదట తన కుటుంబాన్ని కలిసి తరువాత, తాను దిల్లీకి వెళ్తానని చెప్పారు. తన నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నామన్నారు.
అందరూ ఒకే మాటతో సీఎంను ఎంపిక చేస్తామన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తనను, సిద్ధరామయ్యను దిల్లీకి పిలిచిందన్నారు.
కాంగ్రెస్
ఇప్పటికే దిల్లీకి చేరుకున్న సిద్ధరామయ్య
ఇదిలావుండగా, కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే ప్రక్రియలో పార్టీ నిమగ్నమై ఉన్నందున, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
కర్ణాటకలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నియమించిన ముగ్గురు కేంద్ర పరిశీలకులు రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమించే ప్రశ్నపై తమ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించేందుకు సోమవారం దిల్లీకి ఢిల్లీకి చేరుకున్నారు.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పీ) కర్ణాటక ముఖ్యమంత్రి పేరును ఎంపిక చేసేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అధికారం ఇస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింది.
ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ ముఖ్య నేతలు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత సమావేశమై సీఎంని ఎంపిక చేయనున్నారు.