
PM Modi: రామమందిర ప్రారంభోత్సవం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలోని రామ మందిరంలో జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట 'చారిత్రక ఘట్టం' భారతీయ వారసత్వం, సంస్కృతిని సుసంపన్నం చేస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
ఈ కార్యం దేశ అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
అయోధ్యలో శ్రీరాముడి దీక్షను మోదీ చేపట్టిన నేపథ్యంలో, ప్రధానికి అభినందనలు తెలుపుతూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాశారు.
రాష్ట్రపతి లేఖను ప్రధాని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ లేఖపై పై విధంగా స్పందించారు.
దేశమంతటా పండుగ వాతావరణం నెలకొందని, ఇది భారతదేశ శాశ్వతమైన ఆత్మ సహజ వ్యక్తీకరణ అని రాష్ట్రపతి తన లేఖలో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాష్ట్రపతి లేఖను షేర్ చేసిన ప్రధాని మోదీ
माननीय @rashtrapatibhvn जी,
— Narendra Modi (@narendramodi) January 21, 2024
अयोध्या धाम में राम लला की प्राण-प्रतिष्ठा के पावन अवसर पर शुभकामनाओं के लिए आपका बहुत-बहुत आभार। मुझे विश्वास है कि यह ऐतिहासिक क्षण भारतीय विरासत एवं संस्कृति को और समृद्ध करने के साथ ही हमारी विकास यात्रा को नए उत्कर्ष पर ले जाएगा। https://t.co/GdPmx6cluS