Page Loader
Kadapa: భార్య పిల్లలను కాల్చి చంపి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
భార్య పిల్లలను కాల్చి చంపి.. కానిస్టేబుల్ ఆత్మహత్య

Kadapa: భార్య పిల్లలను కాల్చి చంపి.. కానిస్టేబుల్ ఆత్మహత్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2023
06:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

కడపలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కడపలోని స్థానిక కో ఆపరేటివ్ కాలనీలో ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను గన్ తో కాల్చి చంపాడు. అనంతరం తానూ అత్మహత్యకు పాల్పడ్డాడు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు(50) కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటలకు పీఎస్ నుంచి తుపాకీ తెచ్చుకొని, అర్ధరాత్రి తర్వాత ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు అత్మహత్య చేసుకున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్ పేర్కొన్నారు. మృతిదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భార్య పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్