
Karumuri Nageswara rao: కూటమి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రి కారుమూరిపై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
కూటమి నేతలను ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ, 'నరికేస్తాం' అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మ్యానీ, అడకా శ్రీను గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును విచారించిన పోలీసులు కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి, త్వరలో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
Details
కారుమూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలివే
''నేను పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్లాను. కూటమి ప్రభుత్వం ఏం చేసినా మనపై ప్రజలు నమ్మకంతో ఓటేస్తారని చెప్పాను. తెలుగుదేశం నాయకులు మాపై కక్ష పెట్టుకోకూడదంటున్నారు.
అది అసంభవం. గుంటూరు ఇవతల వాళ్లను ఇంట్లోంచి లాగి కొడతారు. గుంటూరు అవతలి వాళ్లను నరికిపారేస్తారు. వాళ్లింటికి మన ఇల్లు ఎంత దూరమో, మనింటికి వాళ్ల ఇల్లు కూడా అంతే దూరమని ఆయన పేర్కొన్నారు.