LOADING...
Kolkata: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో దోషికి జీవిత ఖైదు
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో దోషికి జీవిత ఖైదు

Kolkata: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో దోషికి జీవిత ఖైదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. 2022 ఆగస్టు 9న ఆర్టీకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని ఆత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ దారుణం దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. హంతకులకు కఠిన శిక్షను అమలు చేయాలని విపరీతంగా డిమాండ్లు వినిపించాయి. అయితే, సీల్దా కోర్టు తాజాగా సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు అమలు చేసింది