Page Loader
దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన
దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు

దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన

వ్రాసిన వారు Stalin
Mar 18, 2023
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో కరోనా కేసుల్లో రోజురోజుకు పెరుగుదల నమోదవుతోంది. రోజువారీ కోవిడ్ కేసులు శనివారం నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. దేశంలో మొత్తం కరోనా కేసులు 4.46 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24గంటల్లో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయని కేంద్రం వివరించింది. భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సగటు నెలలో ఆరు రెట్లు పెరిగాయి. నెల క్రితం (ఫిబ్రవరి 18) సగటు రోజువారీ కొత్త కేసులు 112 కాగా, ఇప్పుడు (మార్చి 18) 626కు చేరుకున్నట్లు కేంద్ర వెల్లడించింది.

కరోనా

కరోనా మరణాల రేటు 1.19 శాతం: కేంద్రం

యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.01 శాతం ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. జాతీయ కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైనట్లు చెబుతోంది. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,58,161కి పెరిగినట్లు, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు కేంద్రం చెప్పింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 220.64 కోట్ల డోస్‌ల కరోనా టీకా ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఆకస్మికంగా పెరుగుతున్న వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించడంపై దృష్టి పెట్టాలని కేంద్రం ఆరు రాష్ట్రాలకు లేఖ రాసింది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకలకు పరీక్షలు, చికిత్స, ట్రాకింగ్, టీకాలు వేయడంపై దృష్టి సారించాలని సూచించింది.