Page Loader
Satya Pal Malik: సత్యపాల్‌ మాలిక్ కు సంబంధించిన 30 ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు
సత్యపాల్‌ మాలిక్ కు సంబంధించిన 30 ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు

Satya Pal Malik: సత్యపాల్‌ మాలిక్ కు సంబంధించిన 30 ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 22, 2024
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సంబంధించిన 30 ప్రదేశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోదాలు నిర్వహిస్తోంది. దాదాపు 100 మంది అధికారులతో పలు నగరాల్లోని 30 స్థానాల్లో తమ కార్యకలాపాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. 2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ (హెచ్‌ఇపి) సివిల్ వర్క్‌లను మంజూరు చేయడంలో అవినీతి జరిగింది. ప్రాజెక్ట్‌ల విలువైన కాంట్రాక్టులను ఇవ్వడంలో అవకతవకలకు సంబంధించి మాలిక్‌తో సహా ఐదుగురిపై 2022 ఏప్రిల్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది.

Details 

ఆరోపణలపై స్పందించిన సత్యపాల్ మాలిక్ 

ఆగష్టు 23, 2018, అక్టోబర్ 30, 2019 మధ్య జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న మాలిక్, ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఫైల్‌తో సహా రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి తనకు ₹ 300 కోట్ల లంచం ఆఫర్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యపాల్ మాలిక్ ఎక్స్‌ వేదికగా స్పందించారు."నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ, నా నివాసంపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయి. ఈ సోదాల ద్వారా నా డ్రైవర్ ,సహాయకుడిని అనవసరంగా వేధిస్తున్నారు. ఈ దాడులకు నేను భయపడను; నేను రైతుల పక్షాన నిలబడతాను" అని వెల్లడించారు. గతంలో ఓ బీమా పథకం ఒప్పందానికి చెందిన అవినీతి కేసులో సీబీఐ.. మాలిక్‌ను సాక్షిగా 5 గంటల పాటు విచారించింది.

Details 

జనవరిలో ఐదుగురి ఇళ్లలో ఏజెన్సీ సోదాలు

చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ (P) లిమిటెడ్ మాజీ ఛైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, ఇతర మాజీ అధికారులు ఎంఎస్ బాబు, ఎంకె మిట్టల్, అరుణ్ కుమార్ మిశ్రా, పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌లపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి జనవరిలో ఐదుగురి ఇళ్లలో ఏజెన్సీ సోదాలు నిర్వహించింది.