LOADING...
ZPTC Election Counting: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ZPTC Election Counting: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కడపలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కేంద్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పులివెందుల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 10 టేబుల్స్‌పై ఒక్క రౌండ్‌లో జరుగుతోంది, అయితే ఒంటిమిట్ట ఉప ఎన్నిక 10 టేబుల్స్‌పై సుమారు మూడు రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు కేటాయించారు. మొత్తం 30 సూపర్వైజర్లు, 60 కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఇతర సిబ్బంది కలిపి దాదాపు 100 మంది విధుల్లో ఉన్నారు.

Details

కౌంటింగ్ కేంద్రంలో పటిష్ట బందోబస్తు

కౌంటింగ్ కేంద్రంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు ప్రకటించినట్లుగా, మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పులివెందుల ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్‌ నమోదయింది, అలాగే ఒంటిమిట్టలో 86 శాతం ఓటర్లు హాజరయ్యారు. వైసీపీ పార్టీ కౌంటింగ్ ప్రక్రియను బహిష్కరించినట్లుగా, ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించింది. ఈ రెండు ఉప ఎన్నికల్లో, ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే నెలకొంది.