కేరళ: బీజేపీ నాయకుడి ఇంట్లో బాంబు పేలుడు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని కన్నూర్ జిల్లా కక్కయంగడ్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు కలకలం రేపింది. అయితే ఈ ఘటన ఒక బీజేపీ నాయకుడి ఇంట్లో జరగడం గమనార్హం. ఆదివారం సాయంత్రం ముజక్కున్ను పోలీస్ స్టేషన్ పరిధిలో సంభవించిన ఘటనలో దంపతులు గాయపడ్డారు.
బీజేపీ నాయకుడు సంతోష్ అనే వ్యక్తి ఇంట్లో పేలుడు పదార్ధాలు ఉన్నాయని, అవి మానవ ప్రాణాలకు ముప్పు కగిలిస్తాయని, ప్రాథమిక విచారణ అనంతరం పూర్తి సమాచారం అందిస్తామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సంతోష్‌పై సెక్షన్ 286 కింద కేసు నమోదు చేశారు.
కేరళ
బాంబు పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి: కాంగ్రెస్
సంతోష్ ఇంట్లో రెండేళ్ల క్రితం కూడా పేలుడు సంభవించడం గమనార్హం. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ కార్యకర్త నివాసంలో పేలుడు సంభవించిందని కన్నూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మార్టిన్ జార్జ్ వెల్లడించారు. ఇంట్లో బాంబు పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
శాంతియుత వాతావరణం ఉన్న కన్నూర్‌లో బాంబుల తయారీ వంటి కార్యకలాపాలు కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని మార్టిన్ జార్జ్ అన్నారు.