Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేలా ఆదేశాలంటూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఒకదానికొకటి సవాలు విసురుకుంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఎత్తుగడలతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
ఒక పార్టీ మరో పార్టీపై విమర్శలు చేస్తూ ప్రతిఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.
ఈ క్రమంలో, ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది.
శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాగ్ నివేదికలను సమర్పించేందుకు ప్రత్యేక శాసనసభ సమావేశం నిర్వహించాలన్న పిటిషన్‌పై స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయడానికి హైకోర్టు శుక్రవారం నిరాకరించింది.
వివరాలు
ఆప్,కాంగ్రెస్,బీజేపీ మధ్య త్రిముఖ పోటీ
అయితే,కాగ్ నివేదిక సమర్పణలో సీఎం అతిషి నేతృత్వంలోని ప్రభుత్వం ఆలస్యం చేసిన విషయాన్ని ధర్మాసనం ఎత్తి చూపింది.
ఇటీవల కాగ్ నివేదిక లీక్ అయ్యిందంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది.ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన లిక్కర్ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం జరిగిందని బీజేపీ ఆరోపించింది.
ఈ ఆరోపణలపై ఆప్ నేతలు తీవ్రంగా స్పందిస్తూ బీజేపీ విమర్శలను ఖండించారు.
ఇదిలా ఉంటే,ఎన్నికల ప్రచారం ప్రస్తుతం ఢిల్లీలో ఉధృతంగా కొనసాగుతోంది.
ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించబడుతుండగా,ఫలితాలు ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి.
ఆప్,కాంగ్రెస్,బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది.మరోసారి అధికారంలోకి రావాలని ఆప్ ప్రయత్నిస్తుండగా,బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని కృషి చేస్తోంది.
ఈసారి ఓటర్లు ఏ పార్టీకి అధికారం అప్పగిస్తారన్నది ఉత్కంఠగా మారింది.