Rahul Gandhi: కులగణన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యూపీ కోర్టు సమన్లు జారీ చేసింది. బరేలీ జిల్లా కోర్టు, ఆయన వ్యాఖ్యలు దేశంలో అంతర్యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కులగణనపై చేసిన వ్యాఖ్యలపై ఆరోపణలోచ్చాయి. ఈ నేపథ్యంలో తొలుత ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో కేసు దాఖలు చేశారు. అయితే ఆ కోర్టు కేసును కొట్టివేసింది.
రాహుల్ గాంధీ కోర్టుకు హాజరుకావాలి
ఆ తర్వాత బరేలీ జిల్లా కోర్టును ఆశ్రయించారు. కోర్టు రాహుల్ గాంధీకి 2024 జనవరి 7న హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. పిటిషనర్ చేసిన ప్రకటన ప్రకారం ఈ చర్యల మూలంగా రాహుల్ గాంధీపై కోర్టు ఆదేశాల మేరకు తాము తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు