LOADING...
CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఎంపిక
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఎంపిక

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఎంపిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2025
08:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్డీయే (NDA) తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అవుతారనే ఉత్కంఠ ముగిసింది. ఈ రోజు దిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan) ను నిర్ణయించగా, ఈ నిర్ణయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారంగా ప్రకటించారు. సీపీ రాధాకృష్ణన్‌ 1957 మే 4న జన్మించారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్‌ ఇండియా కాయర్ బోర్డ్‌ ఛైర్మన్‌గా సేవలందించారు.

Details

లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేసిన అనుభవం

తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. రాధాకృష్ణన్‌ 2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు, గతంలో తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఎన్డీయే పక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించిన విషయం తెలిసిందే. నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీ ఈ నెల 21గా నిర్ణయించారు.