LOADING...
Duvvada: జనసేన ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసు
జనసేన ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసు

Duvvada: జనసేన ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దువ్వాడ శ్రీనివాస్ ఓ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే కేంద్రంగా నిలిచాయి. అందులో ఆయన ఎన్నికల ముందు ప్రశ్నించేందుకు వచ్చానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇప్పుడు నెలకు రూ.50 కోట్ల చొప్పున సీఎం చంద్రబాబునాయుడి నుంచి తీసుకుంటూ ప్రశ్నించడం మానేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జనసేన పార్టీ నాయకుడు వంజరాపు సింహాచలం, హిరమండలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు విచారించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాక, శనివారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి టెక్కలి సమీపంలోని ఆయన నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు.