Crops digital survey: రాష్ట్రంలో పంటల డిజిటల్ సర్వే ప్రారంభం.. సర్వేలో పాల్గొన్న ఏఈవోలు
తెలంగాణలో పంటల డిజిటల్ సర్వే ఎట్టకేలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,600 మంది వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈవో)లు గురువారం మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి సర్వేలో పాల్గొన్నారు. 162 మంది ఏఈవోలు సస్పెన్షన్‌లో ఉన్నా కూడా వారు సర్వేలో పాల్గొనడం విశేషం. పంటల డిజిటల్ సర్వేకు వ్యతిరేకంగా ఏఈవోలు ఆందోళనలు చేస్తున్న సమయంలో, ప్రభుత్వం 162 మందిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
సస్పెన్షన్లు ఎత్తివేస్తామని హామీ
ఈ విషయం పై బుధవారం ఏఈవోలు సంఘాల నేతలతో వ్యవసాయ సంచాలకుడు గోపి చర్చలు నిర్వహించారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని, విధులకు హాజరైన వారి సస్పెన్షన్లు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు అందరూ ఉదయమే సర్వేకు బయలుదేరి, పంటల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేశారు.