
CRPF about Fake App: సీఆర్పీఎఫ్ బలగాలకు అలర్ట్.. ఆ నకిలీ యాప్‌తో జాగ్రత్త
ఈ వార్తాకథనం ఏంటి
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఒక అనధికారిక యాప్ విషయంలో అప్రమత్తమైంది. సీఆర్పీఎఫ్ అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను అనుకరించేలా రూపొందించబడిన ఆ యాప్ సిబ్బంది వ్యక్తిగత,సంస్థాగత వివరాలను సేకరిస్తూ భద్రతాపరంగా గంభీరమైన ముప్పును కలిగించవచ్చని హెచ్చరించింది. ఈ కారణంగా సుమారు 3.25 లక్షల మంది సిబ్బందికి జాగ్రత్తగా వ్యవహరించమని సూచన జారీ చేశారు. CRPF ఐటీ విభాగం ప్రకారం,'సంభవ్ అప్లికేషన్ రైటర్' పేరుతో ఓ నకిలీ యాప్ వాట్సప్,యూట్యూబ్ సహా వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం అవుతోంది. ఆ యాప్‌ను CRPF రూపొందించలేదు, వినియోగానికి సిఫార్సు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థలకు ఆ యాప్‌ను ఆన్‌లైన్ ప్లే స్టోర్‌ల నుంచి తొలగించాలని CRPF అభ్యర్థించింది.
వివరాలు
సిబ్బందికి ఉపయుక్తంగా..
వాస్తవానికి, 'సీఆర్పీఎఫ్ సంభవ్' పేరుతో ఉన్న అసలు యాప్ సిబ్బంది వేతనాలు,సెలవులు, బదిలీలు వంటి వ్యక్తిగత,అడ్మినిస్ట్రేటివ్ వివరాలను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. అయితే, 'సంభవ్ అప్లికేషన్ రైటర్' పేరుతో చక్కర్లు కొడుతున్న నకిలీ యాప్ సిబ్బంది వివరాలను అడుగుతోందని సీఆర్పీఎఫ్ తన అడ్వైజరీలో పేర్కొంది. CRPF ఈ విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండమని స్పష్టంగా సూచించింది.