రాహుల్ భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు.. కేంద్రం ఏం అంటోంది?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రత విషయం ఇప్పడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీ భద్రత విషయంలో కేంద్రం సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ చెబుతోంది. భారత్ జూడో యాత్ర ఈనెల 24న దిల్లీకి చేరిన సందర్భంలో.. రాహుల్ గాంధీ భద్రతపై నిర్లక్ష్యం తేటతెల్లమైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇది రాజకీయంగా చర్చకు దారిసింది. అయితే వేణుగోపాల్ రాసిన లేఖకు సీఆర్పీఎఫ్ స్పందించింది. రాహుల్ తామే భద్రత కల్పించినట్లు సీఆర్పీఎఫ్ పేర్కొంది. రాహుల్ గాంధీ అనేక సార్లు భద్రతా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారని చెప్పింది.
113 సార్లు ఉల్లంఘన
రాహుల్ గాంధీకి భద్రత కల్పించే విషయంలో తాము ఎలాంటి పొరపాట్లు చేయలేదని సీఆర్‌పీఎఫ్ వివరించింది. రాహుల్‌కు అవసరమైన భద్రతను తాము కల్పించినట్లు పేర్కొంది. రాహుల్ 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు 113 సార్లు నిర్దేశించిన మార్గదర్శకాలను రాహుల్ గాంధీ ఉల్లంఘించినట్లు చెప్పింది. ఏ రాష్ట్రంలో పర్యటించినా.. ఆ రాష్ట్ర పోలీసులతో పాటు భద్రతా సంస్థలతో రాహుల్‌కు భద్రత కల్పించినట్లు సీఆర్‌పీఎఫ్ వివరణ ఇచ్చింది. రాహుల్ భారత్ జోడో యాత్ర దిల్లీలో అడుగు పెట్టిన సందర్భంలో కూడా దిల్లీ పోలీసులు కూడా భద్రత కల్పించారని సీఆర్‌పీఎఫ్ వెల్లడించింది.