LOADING...
CBSE: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్‌ దాడి.. విద్యార్థుల ఖాతాల్లో అనధికార లాగిన్లు
సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్‌ దాడి.. విద్యార్థుల ఖాతాల్లో అనధికార లాగిన్లు

CBSE: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్‌ దాడి.. విద్యార్థుల ఖాతాల్లో అనధికార లాగిన్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్‌ దాడి జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రీవాల్యుయేషన్‌ పోర్టల్‌లోని పేమెంట్‌ సిస్టమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 50 మంది విద్యార్థుల క్రెడెన్షియల్స్‌ను ఉపయోగించి పోర్టల్‌లోకి అనధికారికంగా లాగిన్‌ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రీవాల్యుయేషన్‌ కోసం చెల్లించాల్సిన అసలు మొత్తానికి బదులుగా పేమెంట్‌ పోర్టల్‌లో ఎక్కువ మొత్తం చూపించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన సాంకేతిక నిపుణులు ఈ లోపాన్ని సరిచేసే పనిలో ఉన్నట్లు సమాచారం.

Advertisement