Loading...
Sajjanar: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక

Sajjanar: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2026
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. రూ.10,000 ఈఎండీ (EMD) చెల్లింపుల పేరుతో నకిలీ ఫోన్ కాల్స్, సందేశాలు, లింకుల ద్వారా మోసగాళ్లు డబ్బులు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇల్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసే వారి మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సూచించారు.

వివరాలు 

నకిలీ కాల్స్‌, లింకులపై అప్రమత్తంగా ఉండాలి

'ఈ రోజే చివరి తేదీ' అంటూ భయపెట్టి డబ్బులు చెల్లింపజేయాలని మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారని సజ్జనార్ తెలిపారు.

వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయకూడదని, ఏపీకే (APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేయొద్దని హెచ్చరించారు.

స్క్రీన్ షేరింగ్ యాప్‌లు ఇన్‌స్టాల్ చేయొద్దు

AnyDesk, TeamViewer వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఎవరైనా సూచించినా ఇన్‌స్టాల్ చేయవద్దని సీపీ స్పష్టం చేశారు.

అలాగే యూపీఐ పిన్‌ను రీఫండ్ కోసం కూడా అడగరని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియజేయవద్దని సూచించారు.

అదేవిధంగా ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు.

వివరాలు 

ఇళ్ల కేటాయింపు పూర్తిగా పారదర్శకం

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో దళారులకు లేదా మధ్యవర్తులకు ఎలాంటి పాత్ర ఉండదని సజ్జనార్ పేర్కొన్నారు.

దరఖాస్తుదారుకు ఇల్లు కేటాయించకపోతే చెల్లించిన ఈఎండీ మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని స్పష్టం చేశారు.

మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి

సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చినా లేదా మోసపోయినా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు.

అలాగే cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వచ్చే నకిలీ కాల్స్‌, సందేశాలు, చెల్లింపు లింకుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్ మరోసారి హెచ్చరించారు.

ADVERTISEMENT