LOADING...
Telangana: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్‌ ..
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్‌ ..

Telangana: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్‌ ..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే పేరుతో కొందరు సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ అధికారులు సూచించారు. సర్వే పేరుతో ఎవరైనా సైబర్‌ నేరగాళ్లు OTP అడిగినా ఇస్తే, అది మోసంగా మారే అవకాశం ఉంది. ప్రజలు ఇటువంటి వాటి నుండి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సర్వే పేరు చెప్పి లింకులు పంపి క్లిక్ చేయమని చెప్పినా వాటిని క్లిక్ చేయొద్దని సలహా ఇచ్చారు. సర్వే ప్రక్రియ కోసం ప్రభుత్వం నియమించిన అధికారులే ఇంటికి వచ్చి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు.

వివరాలు 

 సైబర్‌ క్రైమ్‌ నెంబర్‌ 1930కు కాల్ 

ప్రభుత్వం 94,750 మంది ఎన్యూమరేటర్లు, 9,478 మంది సూపర్‌వైజర్లను సర్వే కోసం నియమించిందని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానం వచ్చినా సైబర్‌ క్రైమ్‌ నెంబర్‌ 1930కు కాల్ చేయాలని ప్రజలను కోరారు. ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్ల వలలో అధికంగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారే పడుతున్నారు. కొందరు కష్టపడి సంపాదించిన డబ్బులను మోసం ద్వారా పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లోకి చొరబడి చోరీ చేయడం కంటే, సిస్టమ్‌ ముందు కూర్చుని మోసాలు చేసే కొత్త రకమైన నేరగాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటువంటి సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.